పోలీస్టేషన్లో జెసి వీరంగం

First Published 21, Dec 2017, 10:28 PM IST
Mla Jc prabhakar reddy  rude behavior with tadipatri police
Highlights
  • పోలీసులను టిడిపి ఎంఎల్ఏ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు

పోలీసులను టిడిపి ఎంఎల్ఏ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇంతకీ పోలీసులు చేసిన నేరమేంటి? అంటే, ఫిర్యాదుపై ఓ టిడిపి కార్యకర్తను అదుపులోకి తీసుకోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే, అనంతపురం మేయర్ స్వరూప మీడియాలో ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై ఫుల్లుగా ఫైరయ్యారు. దానిపై స్పందిస్తూ తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివ, స్వరూపతో పాటు అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి బెదిరించారు. దాంతో స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సరే, అధికారపార్టీ మేయర్ ఫిర్యాదు చేసిన తర్వాత చర్యలు తీసుకోకపోతే ఎలాగ అని పోలీసులు అనుకున్నారు. వెంటనే శివను అదుపులోకి తీసుకున్నారు. అంతే, విషయం తెలియగానే జెసి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగేసారు. నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్ళిపోయి అమ్మనాబూతులు అందుకున్నారు. కనిపించిన పోలీసులందరినీ తిట్టటం మొదలుపెట్టారు. జెసి వీరంగం చూసి పోలీసులు భయపడిపోయారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి శివను బయటకు పంపేసారు. అయితే, మేయర్ డ్రైవర్, జెసి సోదరులను తిట్టారని, కాబట్టి అతన్ని కూడా అరెస్టు చేయాల్సిందే అంటూ డిమాండ్ మొదలుపెట్టారు. దాంతొ పోలీసులు తలలు పట్టుకున్నారు ఏం చేయాలో తెలీక. 

loader