జగన్ కనుసన్నల్లోనే స్పీకర్ పనిచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యులు... అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరులపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు వాళ్లు మళ్లీ సభలో అడుగుపెట్టడానికి లేకుండా చేశారు. కాగా... దీనిపై గోరంట్ల మీడియాతో మాట్లాడారు.

కడప ఫ్యాక్షన్ రాజకీయాలను ఇక్కడకు తీసుకురావద్దన్నారు. కేవలం మా 23మంది ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్... కనీసం తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సస్పెండ్ చేసినా.. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మాట తప్పను.. మడప తప్పను అన్న సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం కనుసన్నళ్లో స్పీకర్ ఉన్నారన్నారు. 30ఏళ్లలో  ఇలాంటి దురదృష్ట విధానాలు ఎన్నడూ చూడలేదని వాపోయారు. నియంతలెందరో కాలగర్భంలో కలిసిపోయారన్నారు.