పార్టీని దెబ్బకొడతా: హై కమాండ్ నుండి పిలుపు రాలేదని గొల్ల బాబురావు ఆవేదన
మంత్రి పదవి దక్కకపోవడం కంటే పార్టీ నాయకత్వం తనను బుజ్జగించకపోవడంపైనే పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబురావు ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
విశాఖపట్టణం: Payakaraopetaకు చెందిన YCP ఎమ్మెల్యే Golla Baburao తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే మంత్రి పదవి దకక్కని అసంతృప్తులను YS Jagan పిలిపించి మాట్లాడినా తనకు కనీసం పలకరింపు కూడా లేకపోవడంపై ఆయన రగిలిపోతున్నారు.ఈ విషయమై అధిష్టానంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయమై పార్టీలో కలకలం రేగింది. దీంతో గొల్ల బాబురావు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
ఈ నెల 11న కేబినెట్ ను సీఎం జగన్ AP Cabinet Reshufle.అయితే కేబినెట్ లో తనకు చోటు దక్కుతుందని గొల్ల బాబురావు ఆశలు పెట్టుకున్నారు. కానీ బాబురావుకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే కేబినెట్ లో చోటు దక్కని అసంతృప్తులు కొందరు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయ భాను, మేకతోటి సుచరిత వంటి వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే వీరికి వైసీపీ అధిష్టానం బుజ్జగించింది. సీఎం జగన్ తో కూడా ఈ నేతలు భేటీ అయ్యారు. అయితే గొల్ల బాబురావుకి మాత్రం వైసీపీ నాయకత్వం నుండి బుజ్జగింపులు లేవు. కనీసం ఆయనను ఎవరూ కూడా పలకరించలేదు. మంత్రి పదవి రాకపోవడం కంటే తనను అధిష్టానం పిలిచి మాట్లాడలేదనే బాధ బాబురావులో ఎక్కువైంది.
Anakapalle జిల్లా కోటవురట్ల మండలంలో గ్రామ,వార్డు, వాలంటీర్ల సన్మానం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ గొల్ల బాబురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత హింసావాదంతో వైసీపీలో జాయిన్ అయ్యాయని చెప్పారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు.. అయితే తనను అమాయకుడిగా భావించి నేడు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాను అమాయకుడిని కాదన్నారు. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని అన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందన్నారు. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయనే విషయాన్ని బాబురావు ఆలస్యంగా గుర్తించారు. వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు.
తన వ్యాఖ్యలపై బాబురావు మంగళవారం నాడు వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనేది సీఎం జగన్ ఇష్టమన్నారు.ఆ విషయమై తాను మాట్లాడబోనన్నారు. విధేయత విషయంలో తేడా లేదన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన జగన్ వెనుకే తాను ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు మంత్రి వర్గంలో చోటు కల్పించకున్నా ఫర్వాలేదన్నారు. కానీ కనీసం తనకు అధిష్టానం నండి ఎందుకు పిలుపు రాలేదనే విషయమై అర్ధం కావడం లేదన్నారు. అధిష్టానం తనను ఎందుకు చులకనగా చూస్తుందో తెలియడం లేదన్నారు.ఈ విషయమై నాయకత్వాన్నే ప్రశ్నించనున్నట్టుగా చెప్పారు. జగన్ పట్ల విధేయత విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఖండించారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకే తాను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు.
ఈ విషయమై పార్టీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.