మంత్రి వాహనానికి ఎమ్మెల్యే డ్రైవర్ గా మారారు. యంగ్ ఎమ్మెల్యే వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. మంత్రిగారు పక్క సీట్లో కూర్చున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి వాహనానికి ఎమ్మెల్యే డ్రైవర్ గా మారారు. యంగ్ ఎమ్మెల్యే వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. మంత్రిగారు పక్క సీట్లో కూర్చున్నారు. ఆ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గా.. ఆ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుడిపాటి గడ్డలో శుక్రవారం జన్మభూమి సభ తర్వాత మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు చాంద్ బాడా దగ్గర ఏపీ ఉర్దూ అకాడమి ఛైర్మన్ నౌమాన్ నివాసం ఉంటున్న ప్రాంతంలో జరుగుతున్న మరో జన్మభూమి సభకు వెళ్లాల్సి ఉంది. కాగా.. ఆ సభకు వెళ్లేందుకు మంత్రి బయలుదేరుతుండగా.. తాను తీసుకు వెళతానని భూమా హామీ ఇచ్చారు.
‘‘ రండి అంకుల్.. నేను డ్రైవ్ చేస్తాను.. చాంద్ బాడా వెళ్దాం’’ అని భూమా మంత్రి ఫరూక్ ని కోరాడు. ఎమ్మెల్యే కోరికను కాదనలేక.. మంత్రి కారు ఎక్కగా.. ఎమ్మెల్యే భూమా డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేశారు. ఇద్దరూ క్షేమంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
