పవిత్రమైన కొండపై రాజకీయాలు మాట్లాడడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటి వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. 

జగన్ కోడి కత్తి డ్రామాను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విచారణకు సహకరించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడమేంటి? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏడాదిగా పోలీసుల రక్షణలో పాదయాత్ర చేస్తున్న జగన్‌..ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదనడం దారుణమని అనిత మండిపడ్డారు.