అది నిజమే, చిక్కులొచ్చాయని రమణదీక్షితులు మాట్లాడుతున్నారు

అది నిజమే, చిక్కులొచ్చాయని రమణదీక్షితులు మాట్లాడుతున్నారు

అమరావతి: శ్రీవారి ఆభరణాలు కొన్ని మాయమయ్యాయనే విషయం నిజమేనని పురావస్తు శాఖ మాజీ జైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి అన్నారు. 2011లో తాము శ్రీవారి ఆభరణాలను పరిశీలించామని, అప్పటికే చాలా ఆభరణాలు మాయమయ్యాయని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలనాటి శాసనానలతో వాటిని పరిశీలించామని చెప్పారు.

ఇబ్బందులు వచ్చాయి కాబట్టి రమణదీక్షితులు వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆభరణాల మాయంతో గత ప్రభుత్వాలకు గానీ ప్రస్తుత ప్రభుత్వానికి గానీ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు  టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. 

ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని ఆయన చెప్పారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. 

ఇదిలావుంటే, రమణదీక్షితులు మంగళవారంనాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. రమణదీక్షితులు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page