విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హర్డ్‌పేటలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  గత మాసంలోనే విజయవాడలో ఓ వృద్దురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని  బాధిత కుటుంబం కోరుతోంది.