తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను బంధించిన ఏడుగురు యువకులు ఆమెపై 4 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ చెప్పుల షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై ఏడుగురు యువకులు కన్నేశారు. ఈ క్రమంలో ఆమెను బలవంతంగా తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు.

అనంతరం నాలుగు రోజుల పాటు పశువుల్లా ఆమెపై పడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఆ మానవ మృగాలు.. కారులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌ బయట వదిలపెట్టి పోయారు.

అయితే తమ కుమార్తె నాలుగు రోజులుగా కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు సరిగా స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో బాధితురాలిని ఏకంగా పోలీస్ స్టేషన్ బయటే విడిచిపెట్టి పారిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.