వ్యసనాలకు బానిసవ్వడమే కాకుండా తండ్రి మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆవేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నూతలపాడు గ్రామానికి చెందిన కుంచాల సుబ్బారావు 14 ఏళ్ల నుంచి విడి విడిగా ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తె పౌలేశ్వరి తండ్రి వద్దే ఉంటోంది. చిన్న కుమార్తె తల్లి పాపమ్మ వద్ద దుద్దుకూరులో ఉంటోంది. సుబ్బారావు బేల్దారీ పనులు చేసుకుంటే జీవనం సాగిస్తున్నాడు.

ఇతను మద్యానికి బానిస కావడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  ఈ విషయంగా తండ్రిని పౌలేశ్వరి పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ సుబ్బారావు ప్రవర్తనలో మార్పు రాలేదు.

రెండు రోజుల క్రితం... మద్యం తాగొద్దని.. తనకు పెళ్లి ఈడు వస్తోందని, తనను పట్టించుకోవాలంటూ తండ్రి వద్ద భోరుమంది. అయినప్పటికీ సుబ్బారావు మద్యం తాగి ఇంటికి రావడంతో పౌలేశ్వరి మనస్తాపానికి గురైంది.

ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పౌలేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.