Asianet News TeluguAsianet News Telugu

అభ్యర్ధికి మంత్రుల క్లాసులు

  • కొత్తగా తీసుకున్న కేంద్ర కార్యాలయంలోనే అభ్యర్ధికి క్లాసులు మొదలు పెట్టేసారు.
  • మంత్రులు బ్రహ్మానందరెడ్డికి ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఎలా మాట్లాడాలన్న విషయం మీద క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం.
  • అభ్యర్ధి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సమస్యలే ఏకరువుపెడుతున్నారు.
  • ఈ పరిస్ధితిల్లో మంత్రులు ఇపుడు క్లాసులు మొదలుపెడితె ఏనాటికి అభ్యర్ది తయారౌతాడు?
ministers giving training to the candidate in nandyala

భూమా బ్రహ్మానందరెడ్డికి మంత్రులు క్లాసులు తీసుకుంటున్నారు. క్లాసు అంటే మీరేదో అనుకునేరు. క్లాసంటే ఇక్కడే కేవలం తర్ఫీదు మాత్రమే. అదేనండి ప్రచారంలో జనాలతో ఏ విధంగా మాట్లాడాలి? బహిరంగ సభల్లో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలపై మంత్రులు అభ్యర్ధికి బుధవారం నుండి తరగతలు మొదలుపెట్టారట. బ్రహ్మానందరెడ్డి అభ్యర్దిగా ఎంపికై సుమారు రెండు నెలలైంది. అంటే చంద్రబాబు ప్రకటించేనాటికే బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టేసారన్న విషయం తెలిసిందే.

అయితే, ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుండి అభ్యర్ధి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కొట్లాడి మరీ టిక్కెట్టు సాధించుకున్నది భూమా కుంటుంబం. టిక్కెట్టు విషయంలోనే కదా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి కూడా టిడిపిని వదిలేసి వైసీపీలోకి చేరింది? మరి అటువంటప్పుడు టిడిపి అభ్యర్ధి ఎలా ఉండాలి? అందరి అంచనాలకు భిన్నంగా ఉన్నారు. ఎలాగంటే, ప్రచారంలో ఎక్కడికెళ్లినా అభ్యర్దిని జనాలు నిలదీస్తున్నారు. తమకు పెన్షన్లు అదటం లేదని, రేషన్ రావటం లేదని, ఇళ్ల స్ధలం లేదని...ఇలా ఓటర్లు తమ కోర్కెల చిట్టా విప్పుతుండటంతో అభ్యర్ధిలో తీవ్ర అసహనం మొదలౌతోంది.

దాంతో వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్ధంకాక అభ్యర్ధి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇలా ఎన్నిసార్లని ప్రచారాన్ని అర్ధాంతరంగా విరమించుకుని వెళ్లిపోతారు? ప్రచారంలో ఎదుదరవుతున్న ఇబ్బందులను కొందరు నేతలు మంత్రులకు చేరవేసారు. అదే విషయాన్ని మంత్రులు చంద్రబాబుకు చెప్పారు. దాంతో అభ్యర్ధికి వెంటనే క్లాసులు మొదలుపెట్టమని ఆదేశాలు వచ్చాయి. దాంతో మంత్రులు కూడా క్లాసులు మొదలుపెట్టేసారు.

కొత్తగా తీసుకున్న కేంద్ర కార్యాలయంలోనే మంత్రులు ఆది నారాయణరెడ్డి, కాలువ శ్రీనివాసులు, అమరనాధరెడ్డితో పాటు ఏవి సుబ్బారెడ్డి తదితరులు బ్రహ్మానందరెడ్డికి ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఎలా మాట్లాడాలన్న విషయం మీద క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఒకవైపేమో షెడ్యూల్ వెలువడే సమయం దగ్గరపడుతోంది. ఇంకోవైపేమో అభ్యర్ధి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సమస్యలే ఏకరువుపెడుతున్నారు. ఈ పరిస్ధితిల్లో మంత్రులు ఇపుడు క్లాసులు మొదలుపెడితె ఏనాటికి అభ్యర్ది తయారౌతాడు?

Follow Us:
Download App:
  • android
  • ios