అవినీతి చేయలేదని చెప్పలేని జగన్‌.. వార్తలపై అభ్యంతరం ఎలా వ్యక్తంచేస్తారని ప్రశ్నించారు.

వైసీపీ అధినేత జగన్ భార్య భారతిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై జగన్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై ఇప్పుడు మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

ఈ కేసు విషయంలో జగన్ చిత్ర విచిత్రంగా వాదిస్తున్నారన్నారు. కేసులో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందో, లేదో జగన్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్‌.. వార్తలపై అభ్యంతరం ఎలా వ్యక్తంచేస్తారని ప్రశ్నించారు.

జగన్‌ రాసిన లేఖ ద్వారానే ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం స్పష్టమైందని యనమల తెలిపారు. ఈడీ ఛార్జిషీట్‌కు తెదేపాకు సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ కేసు ద్వారా సానుభూతి పొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరితోనే కుటుంబసభ్యులు ఇబ్బందిపడే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. జగన్‌ ఎక్కడా కేసులో పేరు ఉండడాన్ని ఖండించలేదని గుర్తుచేశారు.