అమలాపురం ప్రజలు మంచోళ్లని మంత్రి పి విశ్వరూప్ చెప్పారు. ప్రజల మధ్యలో రౌడీ షీటర్లు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అమలాపురంలో రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్నమాట వాస్తమేనని చెప్పారు. 

అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న ఆందోళనల్లో మంత్రి పి విశ్వరూప్ ఇళ్లు ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. కొందరు ఆందోళనకారులు విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్డమైంది. అయితే దాడికి ముందే విశ్వరూప్ కుటుంబ సభ్యులను ఇంటి నుంచి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నేడు అమలాపురంలోని ఇంటి వద్దకు మంత్రి విశ్వరూప్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి దగ్దమైన ఇంటిని పరిశీలించారు. 

ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ.. అమలాపురం ప్రజలు మంచోళ్లని చెప్పారు. ప్రజల మధ్యలో రౌడీ షీటర్లు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అమలాపురంలో రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్నమాట వాస్తమేనని చెప్పారు. పోలీసులు ఇప్పటికే కొందరిని హింసకు పాల్పడిన కొందరిని అరెస్ట్ చేశారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. సంయమనం పాటించాలని తన కార్యకర్తలను కోరారు. 

అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని చెప్పారు. ఈ విధ్వంసంలో టీడీపీ, జనసేన పార్టీల ప్రమేయం ఉందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ పార్టీ నాయకులు ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటిమీద దాడి చేసినవారు.. పక్కనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి చేయలేదని.. ఇక్కడే దీని వెనక కారణాలు అర్థమవుతున్నాయని చెప్పారు. తాము క్షేమంగా ఉన్నామని.. ఎవరూ అధైర్య పడవద్దని చెప్పారు.