ఇల్లు లేని నిరు పేదలందరకీ ఇళ్లను నిర్మించి ఇవ్వలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలో 33, 34, 35 డివిజన్ల వాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 6525మందికి ఈరోజు ఇళ్ల పట్టాలను  పంపిణీ చేశామన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై లక్షల మందికి ఉచితంగా స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణాలను చేయిస్తున్నామన్నారు. 

టీడీపీ హయాంలో మాటలతో మోసపోయారన్నారు. పేదలకు ఇచ్చే  స్థలాలను కూడా టీడీపీ  నేతలు బేరం పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇచ్చిన మాటను జగన్మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు.

అర్హత ఉండి స్థలం రాని‌ వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పిస్తామని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రజల ముంగిళ్లలోకే అన్ని రకాల సర్టిఫికెట్లు వస్తున్నాయన్నారు. వైసీపీది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.