Asianet News TeluguAsianet News Telugu

ఆస్తులపై ఆరోపణలు.. టీడీపీ నేతలకు మంత్రి ఉషశ్రీ చరణ్ ఛాలెంజ్

తన ఆస్తులు పెరిగాయని చెబుతున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు మంత్రి ఉషశ్రీ చరణ్. భూ కబ్జా ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. 
 

minister usha sri charan challenge to tdp leaders
Author
First Published Jan 20, 2023, 2:48 PM IST

తనపై ఆరోపణలు చేస్తున్న వారికి మంత్రి ఉషశ్రీ చరణ్ ఛాలెంజ్ విసిరారు. తన ఆస్తులు పెరిగాయని చెబుతున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని.. తన ఆస్తులు ఎంతో , టీడీపీ నేతల ఆస్తులు ఎంతో చర్చకు సిద్ధమన్నారు. భూ కబ్జా ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. 

ఇకపోతే.. మంత్రి ఉషశ్రీ చరణ్ పై గతేడాది నవంబర్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ వారెంట్ జారీ అయ్యింది. 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్లో ఆమె మీద ఈ మేరకు కేసు నమోదయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్ డి.వి సుబ్రమణ్యం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పుడు 188 సెక్షన్ కింద ఆమెతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ విచారణకు గైర్హాజరు కావడంతో ఆమెతోపాటు కేసులో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

Also REad: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్..

ఇదిలా ఉండగా, ఆగస్టు 15న ఉషశ్రీ చరణ్ తిరుపతిలో హల్ చల్ చేశారు. ఆగస్ట్ 15 కాబట్టి... తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే సెలవుదినాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఉషశ్రీ చరణ్ మాత్రం తిరుమలలో హల్ చల్ చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మరో పదిమంది సుప్రభాతం టికెట్లు పొందారు. ఇక భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్ దురుసుగా ప్రవర్తించగా, వీడియో జర్నలిస్టును నెట్టేశారు. ఇక, మంత్రి ఉష శ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి  టీటీడీ ఈ  టికెట్లను జారీ చేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ సాధారణ భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios