Asianet News TeluguAsianet News Telugu

మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్..

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు మరో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 

Nonbailable warrant on Minister KV Usha Sri Charan
Author
First Published Nov 17, 2022, 6:43 AM IST

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పై బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ వారెంట్ జారీ అయ్యింది. 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్లో ఆమె మీద ఈ మేరకు కేసు నమోదయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్ డి.వి సుబ్రమణ్యం ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు అప్పుడు 188 సెక్షన్ కింద ఆమెతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ బుధవారం కళ్యాణదుర్గం కోర్టులో జరిగింది. మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ విచారణకు గైర్హాజరు కావడంతో ఆమెతోపాటు కేసులో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

ఇదిలా ఉండగా, ఆగస్టు 15న ఉషశ్రీ చరణ్ తిరుపతిలో హల్ చల్ చేశారు. ఆగస్ట్ 15 కాబట్టి... తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే సెలవుదినాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాత్రం తిరుమలలో హల్ చల్ చేశారు ఆమె భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మరో పదిమంది సుప్రభాతం టికెట్లు పొందారు. 

ఇక భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్మెన్లు దురుసుగా ప్రవర్తించారు. వీడియో జర్నలిస్టును నెట్టేశారు.
ఇక,  మంత్రి ఉష శ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి  టీటీడీ ఈ  టికెట్లను జారీ చేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ సాధారణ భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ఎన్నిక!
 
అంతకుముందు, జూలై 6న కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువును మంత్రి ఉషశ్రీ చరణ్ కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 100 ఎకరాల చెరువును పూడ్చి, ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... కళ్యాణదుర్గం లోని సర్వే నెంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని కబ్జా చేశారని పిటిషన్లో తెలిపారు. 

రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ,  జిల్లా కలెక్టర్, ఆర్టీవో లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రెండు వారాల్లో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios