రానున్న ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగురవేస్తుందా? క‌డ‌ప జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల‌తో పాటు.. అన్ని అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుటుంద‌ని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డిలు చెబుతున్నారు.
రానున్న ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగురవేస్తుందా? అవుననే అనిపిస్తోంది.. టీడీపీ నేతల మాటలు వింటే. కడప జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు.. అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుటుందని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేస్తామని చెప్పడం గమనార్హం.

రాయలసీమలో వైసీపీకి పట్టు ఎక్వ. ముఖ్యంగా కడప జిల్లా పెట్టని కోట అని చెప్పవచ్చు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలతోపాటు టీడీపీ నేతలకు కూడా తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో ఆ విషయం రుజువైంది కూడా.ఈ విసయాలు తెలిసినా మంత్రులు, టీడీపీ నేతలు పదే పదే ఈ విషయం గురించి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. వీరి మాటలు చూస్తుంటే తెర వెనుక ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి. ఇద్దరు మంత్రులు ఇలా అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక టీడీపీ నేతలు ఏవైనా కుట్రలకు పాల్పడుతున్నారనా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

గతంలో జరిగిన ఒక ఘటన ఇందుకు తావిస్తోంది. ఇంతకీ అదేమిటంటే? కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా రెండున్నర లక్షల ఓట్లు ఉండేవి. ఓటరు జాబితా సవరణ చేసినప్పుడు సుమారుగా లక్షా 40వేల ఓట్లు మాత్రమే ఉన్నట్లు బయటపడింది. 2014 ఎన్నికల జాబితాతో పోల్చుకుంటే ఒక్కసారిగా లక్షా 10వేల ఓట్లు గల్లంతవ్వడం వైసీపీ నేతలను నివ్వెరపరిచింది. బయటపడిన విషయంతో ఖంగుతిన్న వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని విచారించిన ఎన్నికల సంఘం ఓట్ల గల్లంతుపై జిల్లా అధికారులను వివరణ కోరింది.సరే, ప్రస్తుత విషయానికి వస్తే మంత్రుల తాజా ప్రకటనలు వింటుంటే కడప లో జరినిట్టుగానే జిల్లా వ్యాప్తంగా వైసీపీకి పడతాయి అని అనుకుంటున్న ఓట్లను ఏమన్న తొలగించడం ద్వారా అన్ని సీట్లు గెలుచుకోవాలని టీడీపీ ఏమన్నా వ్యూహం పన్నుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
