ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శిద్ధా రాఘవరావు సోదరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త శిద్ధా వెంకట్రావు(83) అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. కాగా.. మంగళవారం ఒంగోలులో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

శిద్ధా వెంకట్రావు గ్రానైట్ రంగంలో పేరుమోసిన పారిశ్రామికవేత్త. వివిధ వ్యాపార రంగాల్లో పేరుగాంచారు. కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం రాత్రి ఆయన మృతిచెందగా.. సోమవారం ఉదయానికి స్వస్థలానికి తీసుకువచ్చారు.

ఆయన పార్థివదేహాన్ని ఆఖరిసారిగా చూసేందుకు స్థానికులు, ప్రజలు వాళ్ల కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.