Asianet News TeluguAsianet News Telugu

మంత్రి శంకర్ నారాయణ మాటలకు.. ఏడ్చేసిన మహిళ డాక్టర్...

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ మాటలకు అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. సరిపడా సిబ్బంది లేకున్నా.. విధులు నిర్వహిస్తూ, రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వైద్యులు తప్పు పడుతున్నారు. తమ మీద సస్సెన్షన్ వేటు వేసినా తాము సిద్ధమేనని అంటున్నారు. 

minister shankar narayana fires on penukonda govt hospital doctors - bsb
Author
hyderabad, First Published Mar 15, 2021, 5:06 PM IST

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ మాటలకు అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. సరిపడా సిబ్బంది లేకున్నా.. విధులు నిర్వహిస్తూ, రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వైద్యులు తప్పు పడుతున్నారు. తమ మీద సస్సెన్షన్ వేటు వేసినా తాము సిద్ధమేనని అంటున్నారు. 

వివరాల్లోకి వెడితే... ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ అనే ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరు అదే రోజు రాత్రి 11.30 కు పెనుగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు సోమవారం మంత్రి శంకర్ నారాయణ ఆసుపత్రికి వచ్చారు. 

ఈ క్రమంలో వైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. అంతేకాదు అక్కడున్న వైద్యులపై అంతెత్తుకు లేచారు. వైద్యులు సకాలంలో స్పందించడం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకుని ఉన్నారని మండిపడ్డారు. వెంటనే మెమోలు జారీ చేయాలంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. 

సస్పెండ్ చేయాలని డీసీఎస్ హెచ్ రమేష్ నాథ్ తో మాట్లాడారు. మంత్రి మాటలకు అక్కడే ఉన్న వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. నిజాయితీగా పని చేస్తున్న తమ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. అంతేకాదు మంత్రి పూర్తి వివరాలు మాట్లాడితే బాగుణ్ణు అని అన్నారు. 

మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్... ఆరుమంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులు 24 గంటలు పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన తాము సిద్ధమేనన్నారు. ఆసుపత్రుల ర్యాంకింగులో ఎక్కడో ఉన్న తమ ఆసుపత్రిని... ఉన్నతమైన స్థితికి తీసుకు వచ్చామని.. రికార్డులు కూడా పరిశీలించొచ్చు అని తెలిపారు. ఎనిమిది గంటల చేయాల్సిన విధులను ... సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు చేస్తున్నామని అన్నారు. ఇక్కడున్న సౌకర్యాలపై రిపోర్టును పై అధికారులకు పంపామని... త్వరలోనే అన్నీ సమకూరనున్నాయన్నారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios