తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక ఉన్మాది అని అన్నారు. దిశ యాప్ ద్వారా 900 మందని రక్షించామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక ఉన్మాది అని అన్నారు. దిశ యాప్ ద్వారా 900 మందని రక్షించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం లేదని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు వచ్చాయని.. ఈసారి అవి కూడా రావని ఎద్దేవా చేశారు. మహిళా తహసీల్దార్‌ను ఇసుకలో ఇడ్చింది.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో నిందితులను కాపాడిన ఉన్మాది చంద్రబాబు నాయుడని ఆరోపించారు. ఆడపిల్లల రక్షణ కోసం చంద్రబాబు ఏ చర్య చేపట్టలేదని విమర్శించారు. ఏ అర్హత ఉందని సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పింది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని అన్నారు.
ఇక, గత కొద్ది రోజులుగా రోజా పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నేడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు చేశారు. ఇక, రోజాకు.. పర్యాటక, సంస్కృతి, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా ఏపీ కొత్త కేబినెట్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
