Asianet News TeluguAsianet News Telugu

నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి.. మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిర్వాకం

ఏపీ మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. దీనిని గుర్తించిన టీటీడీ అధికారులు అతనిని వెనక్కి పంపారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
 

minister roja escort driver stopped in tirumala temple over unauthorized entry
Author
Tirumala, First Published Jun 11, 2022, 10:04 PM IST

ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార తిరుమల చెప్పులు వేసుకుని నడవటంతో పాటు భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఫోటో షూట్ నిర్వహించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి మంత్రి రోజా (minister rk roja) ఎస్కార్డ్ డ్రైవర్‌గా టీటీడీ (ttd) సిబ్బంది గుర్తించారు. సంప్రదాయ దుస్తులు ధరించకుండా మహాద్వారం నుంచి ఆలయంలోకి మంత్రి రోజా ఎస్కార్ట్‌ డ్రైవర్‌ ప్రవేశించాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన టీటీడీ సిబ్బంది..డ్రైవర్‌ను పడికావలి నుంచి వెనక్కి పంపించివేశారు. అనంతరం డ్రైవర్‌ను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కాగా.. నయనతార-విఘ్నేష్‌ శివన్‌ (Nayanathara-Vignesh Shivan) రెండు రోజుల(జూన్‌ 9న)క్రితం మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మహాభలిపురంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. గతకొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇరువైపు పెద్దల అంగీకారంతో సాంప్రదాయ పద్ధతిలోనే వివాహం(Nayanathara Vignesh Shivan Wedding) చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌కి పలువురు సినీ సెలబ్రిటీలు, పొలిటికల్‌ లీడర్స్ ని, మీడియాని సైతం ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

ALso Read:Nayanathara: ttdకి క్షమాపణలు చెప్పిన నయనతార దంపతులు

ఇదిలా ఉంటే నయనతార జంట తిరుపతిలోని తిరుమలలో శ్రీవారి సమక్షంలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో మ్యారేజ్‌ చేసుకున్న నెక్ట్స్ డేనే(శుక్రవారం) ఈ కొత్త జంట శ్రీవారిని దర్శించుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా వీరు శ్రీవారి మడ వీధుల్లో చెప్పులతో ఫోటో షూట్‌ చేయడం, అక్కడ తిరగడం ఇప్పుడు వివాదంగా మారింది. దీంతో దీనిపై టీటీడీ నయన్‌ జంటపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నయనతార జంట స్పందించి క్షమాపణలు చెప్పారు. 

పెళ్లైన ఆనందం కంటే ఈ వివాదమే ఎక్కువై పోవడంతో ఎట్టకేలకు సారీ చెప్పారు నయనతార, విఘ్నేష్‌ శివన్‌. ఈ మేరకు విఘ్నేష్‌ ఓ నోట్‌ని విడుదల చేశారు. `భగవంతుడిపై మాకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. తిరుమలలో స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాం. అదే పనిపై గడచిన నెల రోజుల్లో ఐదుసార్లు కొండకు వచ్చాం. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి మహాబలిపురంలో జరిగింది. పెళ్లి వేదిక నుంచి నేరుగా తిరుమల చేరుకున్నాం. స్వామి కల్యాణం వీక్షించి శుక్రవారం ఆశీస్సులు పొందాం.

దర్శనం తర్వాత మా పెళ్లి ఇక్కడే జరిగిందన్న భావన కోసం, లైఫ్‌టైమ్‌ మాకు గుర్తుండేలా స్వామి ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ చేసుకోవాలనుకున్నాం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్లి పోయి మళ్లీ తిరిగి వచ్చాం. త్వరగా ఫొటోషూట్‌ పూర్తి చేయాలనే కంగారులో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే సంగతి మరచిపోయాం. మేము భక్తితో కొలిచే ఆ స్వామి అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనను అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మా వల్ల జరిగిన పొరపాటుకు క్షమించమని కోరుతున్నాం` అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios