జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు చెప్పింది వినొద్దని, చిరంజీవి చెప్పింది వినాలని రోజా సూచించారు. ఆన ఆరోగ్యంపై జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని.. వాళ్ల అంత తేలుస్తానని రోజా హెచ్చరించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. వైసీపీని తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబును నమ్మొద్దని పని జరిగిన తర్వాత .. వాడుకుని వదిలేస్తారని పవన్‌కు ఆమె హితవు పలికారు. చంద్రబాబు చెప్పింది వినొద్దని, చిరంజీవి చెప్పింది వినాలని రోజా సూచించారు. టీడీపీ అధినేత ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు చెప్పింది చేయడం వల్లే పవన్ కళ్యాణ్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని ఆమె పేర్కొన్నారు. గుంపుగా వచ్చినా, ఎవరికి వారు విడి విడిగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని రోజా జోస్యం చెప్పారు. ఆన ఆరోగ్యంపై జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని.. వాళ్ల అంత తేలుస్తానని రోజా హెచ్చరించారు. 

అంతకుముందు పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో పవన్, చంద్రబాబు కుమ్మకయ్యారని ఆరోపించారు. పవన్ వారాహి కాదని.. అది నారాహి అని అన్నారు. నారావారి నారాహిపై తిరుగుతూ పవన్ నిత్యం ద్వారంపూడి జపం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చెప్పాడని పవన్ కల్యాణ్ మాట్లాడటం సరికాదని అన్నారు. కాకినాడలో తనపై పోటీ చేయాలని సవాలు విసిరితే పవన్ తోకముడిచి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడని విమర్శలు గుప్పించారు. 

ALso Read: అసత్య ప్రచారాలతో కాకినాడకు ఉన్న మంచిపేరును చెడగొట్టొద్దు: పవన్‌పై ద్వారంపూడి ఫైర్

పవన్ కల్యాణ్‌.. కాకినాడకు ఉన్న మంచిపేరును చెడగొట్టొద్దని అన్నారు. ప్రశాంతంగా ఉంటే కాకినాడలో గంజాయి, రౌడీయిజం, రైస్ అక్రమ ఎగుమతులు అంటూ అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. పవన్‌కు వ్యక్తిగతంగా తనతో ఏమైనా ఉంటే ఫేస్‌ టు ఫేస్ తేల్చుకోవాలని.. కాకినాడ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దని అన్నారు. బెస్ట్ లివింగ్ సిటీస్‌లో కాకినాడ పట్టణం ఒకటి అని చెప్పారు. తన కుటుంబం 50 ఏళ్లుగా రైస్ ఇండస్ట్రీలో ఉందని.. తాము రైసు మిల్లులు నిర్వహించడం లేదని, వాటిని అద్దెకు ఇచ్చేశామని చెప్పారు. తాము కేవలం రైస్ ఎక్స్ పోర్ట్ వ్యాపారంలో మాత్రమే ఉన్నామని తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి పదవి కోసం పవన్, ఆయన పెదనాన్న చంద్రబాబు పోటీ పడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అవగాహన లేకుండా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్ స్రిప్ట్ రాసిచ్చే వ్యక్తిని ఫస్ట్ నిందించాలని విమర్శించారు. పవన్ కల్యాణ్ తన పార్టీలోని ఎవరిని కూడా నాయకుడిగా గుర్తించడం లేదని విమర్శించారు. పవన్ తన పర్యటనలో స్థానిక నాయకత్వాన్ని ఎవరిని పక్కకు నిలబెట్టుకోలేదని.. అలాంటి వారు తనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. వారిది తనను విమర్శించే స్థాయి కాదని అన్నారు. పవన్‌పై తాను పోటీకి సిద్దంగా ఉన్నానని తెలిపారు.