వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీవే.. రోజా సంచలన వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లను వైసీపీయే గెలుచుకుంటుందన్నారు మంత్రి రోజా. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో జగన్ ఆదుకుంటున్నారని ఆమె ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖచ్చితంగా 175 సీట్లను గెలుచుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు. జగన్ పాలనతో రాష్ట్రం బాగుపడిందని.. అభివృద్ధి పరుగులు తీస్తోందని రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో జగన్ ఆదుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు.
కోవిడ్ తర్వాత ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందిందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో వుందన్నారు. టూరిస్ట్ ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని.. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలతో ఉమ్మడి విశాఖ జిల్లాకు నాలుగు ప్రాజెక్ట్‌లు మంజూరు అయ్యాయని రోజా చెప్పారు. తాము అధికారంలోకి రాగానే.. జగన్ సర్కార్ తెచ్చిన సంక్షేమ పథకాలను , వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిందని రోజా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
Also REad:ఆంధ్రా ఊటీ లంబసింగిలో మంత్రి రోజా... గిరిజన మహిళలతో అదిరే స్టెప్పులు
కాగా.. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో రోజా పర్యటించారు. లంబసింగి వద్ద రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హరిత రిజల్ట్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, జడ్‌పీ ఛైర్‌పర్సన్ సుభద్ర, గిరిజనులతో కలిసి రోజా డ్యాన్స్ చేశారు. ఆదివాసీల సంప్రదాయ దింసా నృత్యానికి లయబద్ధంగా స్టెప్పులు వేశారు రోజా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.