మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుంది.. పేర్ని నాని

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని  ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తూ, మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణంగా విశ్వసిస్తారని పేర్నినాని తెలిపారు. 

minister perni nani virtual meeting with people in vijayawada

విజయవాడ : మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. 

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని  ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తూ, మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణంగా విశ్వసిస్తారని పేర్నినాని తెలిపారు. 
                 
సోమవారం ఉదయం Vijayawada పటమట దత్తానగర్ లోని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనేందుకు మంత్రి పేర్ని నాని హడావిడిగా విజయవాడ బయలుదేరారు. ఆ  ప్రయాణ సమయంలో సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. 

జియో జూమ్ మీట్ ద్వారా తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎల్ఈడి బిగ్ స్క్రీన్  టీవీ ద్వారా అక్కడకు వచ్చిన ప్రజలను ముఖాముఖిగా వీక్షిస్తూ వారి సమస్యల గూర్చి ఎంతో ఓపిగ్గా విని పరిష్కారాలు చూపించారు. 

తొలుత స్థానిక రామానాయుడు పేటకు చెందిన యర్రా లక్ష్మి సరస్వతి అనే మహిళ తనకు చేయూత డబ్బులు రెండవ దఫా సైతం  పడలేదని పేర్కొంది. భర్త కాపు కులానికి చెందిన వాడని,  తాను ముదిరాజు కులానికి చెందిన వారమని తొలుత కాపు కులం పేరిట దరఖాస్తు చేసుకొన్నానని ఆ సర్టిఫికెట్ క్యాన్సిల్ కావడం చేత  సిక్స్ స్టెప్ లో పెట్టారని కానీ అక్కడ అంగీకరించబడకపోవడంతో చేయూత డబ్బులు పడలేదని ఆమె చెప్పింది. 

ఈ సందర్భంగా మంత్రి Perni Nani మాట్లాడుతూ, ysr cheyutha scheme ద్వారా  23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం ప్రభుత్వం  అందిస్తున్నదని తెలిపారు. నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులని ముఖ్యమంత్రి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారన్నారు.

minister perni nani virtual meeting with people in vijayawada

వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు మహిళలకు  జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి అన్నారు.  స్థానిక ఆదర్శనగర్ కు చెందిన పల్లె రాంబాబు మంత్రికి తన కుమారుని మానసిక ఆరోగ్య పరిస్థితి,  మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం  కాళ్ళు చేతులు తదితర అవయవాలు సరిగా పనిచేయని స్థితి ఉందని తమ బాబుకు గతంలో తమరు చేసిన సహాయం వలన బాబు చికిత్సలో కొంత పురోగతి జరిగిందని తెలిపాడు. 

ఈ విషయమై మంత్రి Perni Venkataramaiah మాట్లాడుతూ, ఆ బాలునికి  స్టెమ్ సేల్స్ చికిత్స సరైన పరిష్కారం అన్నారు. దెబ్బ తిన్న శరీర భాగాలను మూల కణాల సహాయంతో బాగు చేయవచ్చని నూతన శాస్త్ర పరిశోధనలో  తేలిందని మూల కణాలను దెబ్బతిన్న శరీర భాగాలలో ప్రవేశ పెడితే అక్కడ నూతన కణాలు ఏర్పడి ఆయా వ్యాధులు నయమవుతున్నాయని ఆ చికిత్సకు ఏమేరకు అవకాశాలు ఉన్నాయో విచారణ చేద్దామని చెప్పారు.  

స్థానిక ఇనగుదురు పేటకు చెందిన జాఫర్ అలీ మంత్రి వద్ద తన సమస్యను చెప్పుకొన్నాడు. అర్బన్ బ్యాంకులో తీసుకొన్న అప్పు తాలూకా కిస్తీ చెల్లించమని అధికారులు వత్తిడి తెస్తున్నారని ఒక నెల గడువు దయచేసి ఇప్పించాలని అప్పుడు ఆ డబ్బులు చెల్లిస్తానని మంత్రి పేర్ని నానికి జాఫర్ తెలిపారు. 

దత్తపీఠంలో వైఎస్ జగన్.. అమ్మవారిని దర్శించుకుని, గణపతి సచ్చిదానంద స్వామితో భేటీ..

స్థానిక  విశ్వబ్రాహ్మణ కాలనీకు చెందిన పొన్నాడ మల్లేశ్వరి తన కష్టాన్ని మంత్రికి తెలిపింది. గతంలో తాను 7 వ డివిజన్ లో ఉండగా ఇంటి పట్టా మంజూరు కాబడిందని, మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి జి ప్లస్ 3 పట్టా వద్దని మామూలు స్థలం కావాలని దరఖాస్తు చేసుకొంటే, ఇప్పటివరకు మంజూరు కాలేదని చెప్పింది. ఈ విషయమై 7 వ డివిజన్ కార్పొరేటర్ చిన్నాతో మంత్రి మాట్లాడారు. 90 రోజులలో ఇళ్ల స్థలం మంజూరు అయ్యే జాబితాలో చేర్చేరని త్వరలో మీకు స్థలం వస్తుందని మంత్రి ఆమెకు చెప్పారు.  

బందరుకోటకు చెందిన వేమూరి రంగారావు తన కుమారుడుడికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలనీ హోసింగ్ , టీట్కో, మారిటైం బోర్డులలో  ఉద్యోగ ఖాళీలు  ఉన్నట్లు తమ మావయ్య  తెలిపారని  ఒక ఉద్యోగం ఇప్పించాలని రంగారావు మంత్రిని కోరాడు. తనకు తెలిసి అక్కడ ఉద్యోగాలు ఏమీ  లేవని మీ బంధువుని ఒకసారి తనతో మాట్లాడించమని మంత్రి పేర్ని నాని చెప్పారు.      

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios