హీరో నాని, ఇతర హీరోలపై నీ కపట ప్రేమ ఏంటో మాకు తెలుసునని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మా ఎన్నికల కోసమే నీ తాపత్రయం అని తమకు తెలుసునని మంత్రి ఆరోపించారు. 

హీరో నాని, ఇతర హీరోలపై నీ కపట ప్రేమ ఏంటో మాకు తెలుసునని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మా ఎన్నికల కోసమే నీ తాపత్రయం అని తమకు తెలుసునని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీకు అంత భయం ఎందుకని నాని దుయ్యబట్టారు. వకీల్ సాబ్ సినిమాకు ఏపీలో వచ్చిన ప్రొడ్యూసర్ షేర్ రూ. 50 కోట్ల పై మాటేనని.. ఆ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ఏడాదికి జగన్ ప్రభుత్వం వివిధ పథకాల కింద పేదలకు ఇచ్చేది రూ.60 వేల కోట్లని పేర్ని నాని వెల్లడించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:ఇద్దరం ఒకటే కులం.. నువ్వు సన్నాసి అన్నా, నేను ఏరా శుంఠ అన్నా పర్లేదు: పవన్‌కు పేర్నినాని చురకలు

టికెట్ల మీద వచ్చే డబ్బుతో ప్రభుత్వం అప్పు తెచ్చువాలని చూస్తోందని పవన్ అన్నారని.. ఆన్‌లైన్ టికెటింగ్ కోసం చాలా ఏళ్లనుంచి సినీ పరిశ్రమ అడుగుతోందని మంత్రి గుర్తుచేశారు. ఆన్‌లైన్ టికెటింగ్‌‌లో ప్రభుత్వ పోర్టల్ మాత్రమే వుంటుందని నాని చెప్పారు. పోర్టల్‌లో థియేటర్ల యజమానులే టికెట్లు అమ్ముకుంటారని.. నీ ఇష్టం వచ్చినన్న షోలు వేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని మంత్రి ప్రశ్నించారు. రెండు చోట్లా ఓడిపోయిన వాడు సన్నాసి కదా అని నాని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని.. రిజర్వేషన్ల అవసరమే లేదంటూ నువ్వు మాట్లాడింది మరిచిపోయావా అంటూ మంత్రి చురకలు వేశారు. రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్ ముందే స్పష్టం చేశారని.. కాపుల అభివృద్ధి కోసం కట్టుబడి వుంటానిన మాత్రమే చెప్పారని నాని గుర్తుచేశారు.