తాను జగన్ పాలేరునేనని.. నువ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా అంటూ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. తాను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరు అంటూ పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తానని హెచ్చరించారు

కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కళ్యాణే అన్నారు మంత్రి పేర్ని నాని. రాజకీయ పార్టీని టెంట్ హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారని అన్నారంటూ దుయ్యబట్టారు. నిర్మాతల బృందం తనతో భేటీ అయిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ పాలేరునేనని.. నువ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా అంటూ నాని సవాల్ విసిరారు. తాను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరు అంటూ పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తానని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌కు వాళ్లమ్మ సంస్కారం నేర్పలేదా అంటూ నాని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టమని అంజనాదేవి నేర్పించారా అని మంత్రి ప్రశ్నించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, బన్నీవాసు తదితరులు మంగళవారం మచిలీపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, ఇతర ఇబ్బందులపై మంత్రితో వారు చర్చించారు. అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి నాతో మాట్లాడారని తెలిపారు. సినీ ఫంక్షన్‌లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు. ఆ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమన్నారని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని అన్నారు.

ALso Read:పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో విభేదించిన చిరంజీవి.. పేర్ని నాని వెల్లడి

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. ఏపీ మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు.