సినీ ఫంక్షన్‌లో జరిగిన ఘటనపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని అన్నారు. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కల్యాణే అని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. 

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, బన్నీవాసు తదితరులు మంగళవారం మచిలీపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, ఇతర ఇబ్బందులపై మంత్రితో వారు చర్చించారు. అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి నాతో మాట్లాడారని తెలిపారు. సినీ ఫంక్షన్‌లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు. ఆ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమన్నారని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని అన్నారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కల్యాణ్ ఒక్కరే అని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. 

అవును, తాను రెడ్లకు పాలేరునే అని, తాను జగన్మోహన్ రెడ్డికి పాలేరును అని, పవన్ కల్యాణ్ కు ఎవరికి పాలేరు అని, పవన్ కల్యాణ్ కమ్మలకు పాలేరా అని నాని అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టడం సంస్కారమా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ఆయన తల్లి అంజనీదేవి సంస్కారం నేర్పలేదా అని నాని ప్రశ్నించారు. నువ్వు ఎవరి పాలేరువో చెప్పే ధైర్యం నీకు ఉందా అని ఆయన పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. ఏపీ మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు.