టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు మంత్రి పేర్ని నాని. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంద్రకీలాద్రిపై దేవుణ్ణి మొక్కుకుని వచ్చారని చెబుతున్నారని.. అక్కడికి వెళ్లి దొంగ దండాలు పెట్టింది, కొండ కింద వున్న మీ వాళ్ల కోసం కాదా అని ఆయన ప్రశ్నించారు.

దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసిన పాపానికి రాజకీయాల్లో కుక్క చావు దాపురించిందని నాని ఎద్దేవా చేశారు. మనసులో ఒకటి పెట్టుకుని అమ్మ దర్శనం చేసుకుంటే మాత్రం భవిష్యత్‌లో ఇంకా దుర్గతి కలుగుతుందని పేర్ని నాని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ మాదిరిగా చంద్రబాబు సైతం ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇంత అనుభవం, వయసుకు తగినట్లుగా మాట్లాడాలని పేర్ని నాని హితవు పలికారు.

జగన్ పీకడం మొదలు పెట్టగానే.. కోట్లు కోట్లు ఖర్చుపెట్టి నల్లకోట్లు వెనుక చంద్రబాబు దాక్కున్నారని నాని సెటైర్లు వేశారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి మండిపడ్డారు.

ఈ పోరాటం చంద్రబాబు గురించి కాదని.. లోకేశ్ కోసమని ఆయన స్పష్టం చేశారు. 14 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. 2024 నాటికి రాజకీయాల నుంచి ఎలాగూ తప్పుకోక తప్పదని.. దానికి రెఫరెండాలు దేనికని పేర్నినాని మండిపడ్డారు. చంద్రబాబుకు ముసళ్ల పండుగ ముందుందన్నారు.