రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ మంత్రి నారాయణపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఇది సచివాలయమా లేదా నారాయణ విద్యాసంస్థలకు చెందిన హాస్టల్ భవనమా అనేది తెలియడం లేదన్నారు.

సెక్రటేరియేట్‌లో అన్నీ ఇరుకు గదులేనని.. చాలీచాలనట్టుగా అసెంబ్లీలో గదులు నిర్మించారని.. అసెంబ్లీలో లఘశంక తీర్చుకోవాలన్నా ప్రతి ఒక్కూ పై అంతస్తుకు పరుగులు తీయాల్సి వస్తోందని ఫైరయ్యారు.

రాజధానిలో అన్నీ తాత్కాలిక కట్టడాలేనని.. శాశ్వత భవనాల ఏర్పాటు అనంతరం వీటిలో నారాయణ హాస్టల్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బిల్డింగ్‌లు ఈ విధంగా నిర్మించారేమోనంటూ నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన నిధులతో పాటు తన బినామీలు, బంధువుల నుంచి బాండ్ల పేరుతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని.. తమకు అమరావతిలో అప్పులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు.