శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న టికెటింగ్ వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ బుకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

సినిమాకు సంబంధించి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న టికెటింగ్ వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ బుకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లలో అమలు చేసేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు నిర్వహించింది ప్రభుత్వం. చాలామంది ఆన్‌లైన్‌ వ్యవస్థపై మొగ్గుచూపడంతో ప్రభుత్వం కార్యచరణను వేగవంతం చేస్తోంది. 

కాగా.. రాష్ట్రంలో బెనిఫిట్ షోలను (benefit show) ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై సినిమా హాళ్లలో నాలుగు షోలు మాత్రమే నడవనున్నాయి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు వుంటుందని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఆన్‌లైన్ టికెటింగ్‌పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పేర్ని నాని (perni nani) . ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read:టాలీవుడ్‌కు జగన్ స్ట్రోక్: బెనిఫిట్ షోలు రద్దు, ఇకపై నాలుగు ఆటలే.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

తక్కువ రేటుకు సినిమా టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. సినిమా వాళ్లకు ఇబ్బందేమి లేదని.. ఇబ్బందంతా కొన్ని రాజకీయ పార్టీలకేనని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ (ap cinematography act)బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ (rrr movie ), పుష్ప (pushpa movie) వంటి సినిమాలకు పెద్ద దెబ్బ కలగనుంది. 

పెద్ద సినిమాలు విడుదలైన తొలి రెండు రోజులు టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుంటున్నారు నిర్మాతలు. అదే సమయంలో బెనిఫిట్ షో పేరుతో ముందస్తుగానే సినిమాని థియేటర్లలో ప్రదర్శిస్తూ టికెట్ రేట్లను ఐదారు రెట్లు ఎక్కువకి అమ్ముకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని అధికారికంగానే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. అయితే వైసీపీ హయాంలో బెనిఫిట్ షో వ్యవహారానికి బ్రేక్ పడింది.