ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల విషయమై ఈ సినిమా తమకు దరఖాస్తు పెట్టుకున్నదని, ఆ దరఖాస్తును పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు. కొత్త జీవో ప్రకారమూ.. జీవోకు ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో మినహాయింపులు ఉంటాయని వివరిచారు.
అమరావతి: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. ఆ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
నిర్మాణ సంస్థలు సినిమా విడుదల చేసిన మూడు నాలుగు రోజుల్లో పెట్టిన డబ్బులు తిరిగిరావాలని విపరీతంగా టికెట్ల రేట్లు పెంచే సంస్కృతి ఉన్నదని, తద్వార అది ప్రజలపై భారం పడుతుందని మంత్రి పేర్ని నాని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రజలపై భారం పడకుండా.. మంచి సినిమాలు తీయడానికి నిర్మాతల భుజం తట్టడానికీ తాము న్యాయమైన టికెట్ల ధరలను నిర్ణయించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అని వివరించారు. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నదని తెలిపారు. దాన్ని త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జీవోకు ముందుగా నిర్మాణం పూర్తయిన సినిమాలకు మినహాయింపులు ఉంటాయని, ఆ సినిమాలు పది రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇది వరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోనే తొలి పది రోజుల్లోనే టికెట్ రేట్ల విషయంలో మినహాయింపు ఉన్నదని వివరించారు. కానీ, జీవో తర్వాత నిర్మించే సినిమాలకు ఈ మినహాయింపు ఉండదని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణానికి రూ. 336 కోట్లు ఖర్చు అయినట్టు తమకు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. అయితే, సినిమా టికెట్ రేట్లు ఎంత పెంచుకోవచ్చని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారిస్తుందని తెలిపారు. సినిమాకు పెట్టిన డబ్బులు, ప్రజలపై భారం కాకుండా టికెట్ రేట్లు నిర్ధారిస్తుందని వివరించారు.
అలాగే, ఆన్‌లైన్ టికెట్లు విషయంపైనా మాట్లాడారు. ఈ ప్రక్రియ నిర్వహించడానికి రెండు కంపెనీలు టెండర్లు వేశాయని తెలిపారు. అలాగే, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడూ ఐదు షోలు వేయడానికి తమ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు. అయితే, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు చిన్న సినిమాలూ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని చెప్పారు. కాగా, కొత్త ఆదేశాల ప్రకారం, సినిమాల్లో 20 శాతం మన రాష్ట్రంలోనే చిత్రీకరించాలని స్పష్టం చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు మరోసారి జోరుగా మొదలయ్యాయి. దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్రం కనీవినీ ఎరుగని అంచనాల నడుమ మార్చి 25న బ్రహ్మాండమైన విడుదలకు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుందని రాజమౌళి, ఎన్టీఆర్,రాంచరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలకి కొంచెం ఫన్ జోడించారు. ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లని ఇంటర్వ్యూ చేశారు. ఫుల్ ఫన్ గా సాగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బాగా అల్లరి చేశారు. షూటింగ్ సమయంలో రాజమౌళి ఎలా ఉంటారో పూర్తి హాస్య భరితంగా వివరించారు.
