చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలన్నీ అధికారంలోకి రాకముందే ఊహించామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  ట్వీట్‌ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

 

‘‘చంద్రబాబు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్‌ చేయగలడో అందరికీ తెలుసు.. వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని’’ ట్విటర్‌ వేదికగా పేర్ని నాని స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయమై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ ఓ వైపు అక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి చంద్రబాబు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.