ఎంతో ఆర్భాటంగా ఈమధ్యే టిడిపి ‘దళిత తేజం’ కార్యక్రమం నిర్వహించింది. అంటే దళితులను పార్టీ వైపు ఆకర్షించటమే ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం జరిగి ఎన్నో రోజులు కూడా కాలేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ చేసిన ఓ నిర్వాకంతో దళితులకు టిడిపిలో ఉన్న విలువ ఎంతో అందరికీ తెలిసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే, మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి కూర్చోవటానికి కనీసం కుర్చీ కూడా వేయలేదు గోమతినగర్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు.

నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి, కార్పొరేటర్‌ రాజానాయుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోవటానికి కుర్చీలు వేయించిన మంత్రి ఛైర్ పర్సన్ కూర్చోవటానికి మాత్రం కుర్చీ వేయించలేదు. దాంతో మీడియా సమావేశం జరుగుతున్నంత సేపూ నిలబడే ఉన్నారు.