అవిశ్వాసం వీగిపోయినప్పటకీ.. నైతికంగా తామే గెలిచామని మంత్రి నారాయణ అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా..కేంద్రమే ఎక్కువ ఓట్లు గెలుచుకుందతి. దీంతో.. అవిశ్వాసం వీగిపోయింది. దీనిపై ఈరోజు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ పై కూడా మంత్రి మండిపడ్డారు.

 రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం జగన్ అవివేక చర్య అని మంత్రి నారాయణ మండిపడ్డారు.  పార్లమెంటులో పోరాడకుండా పారిపోయిన పార్టీ వైసీపీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో అవిశ్వాసం వీగిపోయినా టీడీపీ నైతిక విజయం సాధించిందని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశప్రజలందరికీ చెప్పగలిగామన్నారు. కన్నా, సోము వీర్రాజుకు ఏపీలో తిరిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. 2019లో ఏపీలో బీజేపీకి ఒక్కసీటు రాదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.