టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి మృతిపై మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. నెల్లూరు ప్రజలకు ఆనం వివేకా ఎంతో సేవచేశారని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వివేకాతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఒక మంచి నాయకుడుని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థినట్లు నారాయణ తెలిపారు. ఆనం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలియజేశారు.