జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై  మంత్రి లోకేష్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.  పవన్, జగన్ లు బీజేపీతో కుమ్మకయ్యారని మండిపడ్డారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్రమోదీకి.. పవన్ కళ్యాణ్ దత్తత పుత్రుడుగా పేర్కొన్నారు. అభివృద్ధి పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్ అని విమర్శించారు. 

మంగళవారం కర్నూలు జిల్లా గూడూరు మండలంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.