పెనుమాక లో వ్యాక్సిన్ వికటించడంతో మృతి చెందిన ఆశ వర్కర్ విజయలక్ష్మి కుటుంబాన్ని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డిలు  పరామర్శించారు. 

ఆశ వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఆ కుటుంబానికి ఇళ్ళ స్థలం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం విజయలక్ష్మి మృతికి కారణం తెలుస్తుందని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు రావడానికి వారం సమయం పడుతుందని, ఈ రిపోర్ట్ త్వరగా వచ్చేలా చూస్తామని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.