Asianet News TeluguAsianet News Telugu

‘ట్రిబ్యునల్ తీర్పుతో చంద్రబాబు కంట్లోంచి రక్తం కారుతోంది, నిద్ర కరువయ్యింది’.. కురసాల కన్నబాబు..

కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని చెప్పారు. 

minister kurasala kannababu comments on chadrababu naidu over heritage shares
Author
Hyderabad, First Published Jan 13, 2022, 10:06 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాకినాడ :  సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమైనవే అని, చట్టబద్ధమైనవేనని IT appellate tribunal తీర్పు ఇవ్వడాన్ని Chandrababu Naidu జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి kurasala kannababu అన్నారు. రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారారని చెప్పుకొచ్చారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్ల చులకన భావాన్ని ప్రదర్శిస్తూ.. చెడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే…

 నాడు కుట్ర చేసి ఇరికించారు…
- ‘సాక్షి’లో కొన్ని సంస్థలు రాజమార్గంలో సుమారు రూ.1200 కోట్లు పెట్టుబడులు పెడితే,  ఇదంతా  అక్రమం అన్నట్లుగా చిత్రీకరించారు.  ఆనాడు కాంగ్రెస్ తో లోలోన కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించారు. ఇన్కమ్ టాక్స్, ఈడీ వంటి వాటిని ప్రయోగించి రాజకీయంగా పైకి రానివ్వకూడదని అణచివేతకు లేనిపోనివి సృష్టించారు. అయినా వైయస్ జగన్ దేనికీ వెన్ను చూపలేదు.

- ఈ నేపథ్యంలో సాక్షి పెట్టుబడులన్నీ  సక్రమమేనని, ఏవీ దొడ్డి దారిన  రాలేదని ఇటీవల ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో chandrababu కంట్లో నుంచి రక్తం కారుతోంది. విపరీతంగా  బాధ బాధపడుతున్నాడు. ఆయనకు కు నిద్ర కరువైంది.. చివరికి న్యాయవ్యవస్థను తప్పు పట్టేలా తయారయ్యాడు

- 2008లో ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటో బయటపడ్డాయి. అందుకే కేసులు ఒక్కొక్కటిగా నీరుగారి పోతున్నాయి. లక్ష కోట్ల రూపాయల మేరకు అవినీతి అని chandrababu, ఎల్లో మీడియా గగ్గోలు చేసింది  అభియోగం లక్ష కోట్లు కాదని, కేవలం రూ.1200 కోట్లు మాత్రమేనని అప్పటి దర్యాప్తు అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల చెప్పారు. ఇప్పుడు ఇది కూడా  తేలిపోవడంతో బాబుకు నిద్ర రావడం లేదు.

- ఆనాడు సాక్షిలో పెట్టుబడులపై ముందుగా ఐటీని పంపించారు. ఆ పెట్టుబడులు సక్రమం కాదని దుర్మార్గమైన ఆర్డర్ ఇప్పించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో మనందరికీ తెలుసు ఎందుకు సాక్షిని టార్గెట్ చేశారు.. అనేది అందరికీ తెలుసు. సాక్షిని దెబ్బతీస్తే జగన్ జగన్ వాయిస్ బయటకు రాకుండా చేయొచ్చని వాళ్ళ నమ్మకం.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట...
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే హెరిటేజ్ షేర్ ఎందుకు పెరిగింది? ఆయన అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చాక.. ఆ కంపెనీ షేర్లు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగేనాటికి షేర్ విలువ రూ.13 నుంచి 14 వరకు ఉండేది.  2014లో అధికారంలోకి వచ్చాక 100 రూపాయలకు పెరిగింది. దీనికి బాబు ఏమని సమాధానం చెబుతారు?

- చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 ఆయన బలం. అయితే జన బలం ముందు ఆ బలం సరిపోక చతికిలపడ్డారు

- చంద్రబాబు అవినీతి గురించి అందరికీ తెలుసు. ఏలూరు నుంచి అమరావతి వరకు ఎన్నిస్కామ్ లు చేశారో కూడా తెలుసు. ఏలేరు స్కామ్ ను  బయటకు తీసింది  నేనే (రిపోర్టర్ గా ఉన్నప్పుడు), ఈ స్కామ్ లో అప్పట్లో చంద్రబాబును ఆరు గంటల పాటు విచారిస్తే ఆయన అనుకూల పత్రికలు ఎంతో బాధ పడ్డాయి

- ఉద్యోగులపై చంద్రబాబుకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. అలాంటి బాబు ఇవాళ పీఆర్సీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగులపై ఎంత గౌరవం ఉందో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన చిట్ చాట్ బట్టబయలు చేసిన విషయం అందరికీ తెలిసిందే

- ఇతర కంపెనీలతో పాటే భారతీ సిమెంట్ కూడా బస్తా రూ.230 చొప్పున ప్రభుత్వానికి ఇస్తున్న విషయం బాబుకు తెలియదు కాబోలు. ఇవాళ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చంద్రబాబూ.. మీ మాటలు ఎవరు నమ్మరు. ఇప్పటికైనా మారండి. 

Follow Us:
Download App:
  • android
  • ios