తనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు క్షుద్రపూజలు చేశారు కాబట్టే దుర్గమ్మ మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. 

తనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు క్షుద్రపూజలు చేశారు కాబట్టే దుర్గమ్మ మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఇంటింటికి బెల్ట్ షాపులు పెట్టించారని నాని ధ్వజమెత్తారు. దుర్గమ్మ ఆశీస్సులతోనే వెల్లంపల్లి మంత్రి అయ్యారని ఆయన తెలిపారు.

కృష్ణమ్మ పుష్కరాల పేరుతో రూ.3 వేల కోట్లు తిన్నారని.. మీరేనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది అంటూ నాని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ధర్మపోరాటం చేశారని.. ఏమైంది మీ పోరాట యాత్ర అంటూ మంత్రి సెటైర్లు వేశారు.

కరోనా వచ్చాకా తండ్రీ, కొడుకులు 8 నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదని.. ఇప్పుడొచ్చి ప్రజలను బయటకు రావాలని అంటారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. మీ దగా, మోసం చూశారు కాబట్టే.. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని అనాథ చేసింది మీరు కాదా అంటూ మంత్రి నిలదీశారు. ఇంటికొక్కరు వచ్చి కృష్ణా జిల్లా నుంచి బాబును బయటకు పంపాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

కేంద్రం నడిపే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను జగన్ అమ్మేస్తారా..? పెట్రోల్, గ్యాస్ రేట్లను మేం పెంచామా..? అంటూ ఆయన ప్రశ్నించారు. మీకు దమ్ముంటే మోడీని నిలదీయాలని మంత్రి సవాల్ విసిరారు.

మొన్న కుప్పంలో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని.. సీబీఐకి భయపడి నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారని నాని ఆరోపించారు. ఏ, బీ, సీ, డీ, ఎఫ్ చంద్రం తాతా టప్ అంటూ బాబు మనవడు తిరిగేవాడంటూ ఆయన సెటైర్లు వేశారు.

చంద్రబాబును నమ్ముకుంటే కుక్క తోకను పట్టి గోదారి ఇదినట్లేనంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చి దొరికిపోయిన దొంగ.. చంద్రబాబు అని, ఆయన ఒక దుర్మార్గుడని సాక్షాత్తూ ఎన్టీఆరే వీడియో విడుదల చేశారని నాని గుర్తుచేశారు.

టీడీపీకి మనుగడ లేదని ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారని.. సీఎం జగన్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు, ప్రజలకు విడదీయలేని అనుబంధం వుందని.. దోచుకున్న కోట్లాది డబ్బును హెరిటేజ్‌లో దాచుకుంది చంద్రబాబేనని నాని ఆరోపించారు.

చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు. చంద్రబాబు పిచ్చివాగుడిని తగ్గించుకుని బుద్ధిగా వుండాలని, లేదంటే ప్రజలతోనే బుద్ధి చెబుతామని నాని వార్నింగ్ ఇచ్చారు.