ధరలు పెరగడం సహజమే... అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని
నిత్యావసర ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయని.. ధరలు ప్రతి ఏడాది 10శాతం పెరగడం సహజమేనని కొడాలి నాని సమాధానం ఇచ్చారు. కాగా.. నేడు నిత్యావసర ధరలు పెరుగుదల, టెలి మెడిసిన్ కేంద్రాలు పనిచేయకపోవడం, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో వివక్షతపై టీడీపీ ప్రశ్నలు సంధించనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్యవసర ధరలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే భవాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని ఆమె పేర్కొన్నారు.
కాగా... ఆమె ప్రశ్నలకు మంత్రి కొడాలి నాని స్పందించారు. నిత్యావసర ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయని.. ధరలు ప్రతి ఏడాది 10శాతం పెరగడం సహజమేనని కొడాలి నాని సమాధానం ఇచ్చారు. కాగా.. నేడు నిత్యావసర ధరలు పెరుగుదల, టెలి మెడిసిన్ కేంద్రాలు పనిచేయకపోవడం, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో వివక్షతపై టీడీపీ ప్రశ్నలు సంధించనుంది.
వేరుశనగ, పసుపు పంటలకు మద్దతుధర లేకపోవడంపై కూడా ప్రభుత్వాన్ని.. టీడీపీ ప్రశ్నించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా.. ఇవాళ మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది.