మంత్రి కాలువ శ్రీనివాసులు కి తృటిలో తప్పిన ప్రమాదం

First Published 3, Aug 2018, 4:02 PM IST
minister kalva srinivasulu narrow escape from the accident
Highlights

ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఎదురుగా మరో వాహనం రాగా.. దానిని తప్పించబోయి.. పక్కనే ఉన్న కల్వర్టుని ఢీకొట్టారు.

మంత్రి కాలువ శ్రీనివాసులుకి తృటిలో ప్రమాదం తప్పింది.  అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం కాలువపల్లి దగ్గరలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఎదురుగా మరో వాహనం రాగా.. దానిని తప్పించబోయి.. పక్కనే ఉన్న కల్వర్టుని ఢీకొట్టారు.

వాహనంలో కాలువ శ్రీనివాసులతోపాటు జెడ్పీ చైర్మన్ నాగరాజు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. వీరికి ఎలాంటి హాని కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో ఫోన్ ద్వారా కాల్వను పరామర్శించారు.
 
గతంలో మావోయిస్టులు మాజీ మంత్రి పరిటాల రవీంద్రను లక్ష్యంగా మందుపాతర పేల్చారు. అయితే ఈ ప్రమాదంలో పరిటాల క్షేమంగా బయటపడ్డారు. కాన్వాయ్‌లో చివరి వాహనంలో ప్రయాణిస్తున్న కాలువ శ్రీనివాస్ వాహనం పేలుడుధాటికి పల్టీలు కొట్టింది. అప్పుడు కూడా ఆయన చిన్న గాయాలతో బయటపడ్డారు. రెండు ప్రమాదాలను చూసిన జిల్లా వాసులు కాల్వ మృత్యుంజయుడు అంటూ పేర్కొనడం విశేషం. 

loader