ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ కి మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా ఏరోజైనా ప్రజల కోసం పనిచేశావా అంటూ కళా.. జగన్ ని ఆ లేఖలో ప్నశ్నించారు. రాష్ట్రాభివృద్ధిని అండుకుంటున్నారంటూ మండిపడ్డారు.

కేసుల మాఫీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేత అమిత్ షా తో కుమ్మక్కై.. తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారీ తుఫాను వచ్చి శ్రీకాకుళం జిల్లా కకావికలమైతే.. బాధితులను ఎందుకు పరామర్శించడానికి రాలేదేని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నప్పటికీ రైల్వే జోన్ కోసం, ఉత్తరాంధ్రకు కేంద్ర ఇవ్వాల్సిన నిధులు గురించి ఏనాడైనా  నిలదీసారా..? అని ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణం గురించి ఎందుకు నోరు మెదపడం లేదని జగన్ ని ప్రశ్నించారు.