లారీని ఢీకొట్టిన మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం... ఘటనాస్థలికి చేరుకున్న దేవినేని ఉమ 

లారీని వెనకనుండి ఢీకొట్టిన పోలీసులే వాహనం రిపేర్ ఖర్చులు భరించాలని ఒత్తిడి చేయడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేసారు.   

Minister Jogi Ramesh Vehicle hits running Lorry at Guntupally NTR District AKP

విజయవాడ : మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. హైవేపై వేగంగా దూసుకువచ్చిన పోలీస్ వాహనం ఓ లారీని వెనకనుండి ఢీకొట్టింది. ఇందులో లారీ డ్రైవర్ తప్పేమీ లేకున్నా పోలీసులు అతడిపై దౌర్జన్యం చేస్తున్నారని... పోలీస్ వాహనం రిపేర్ ఖర్చులు భరించాలని బెదిరించారట. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

వివరాల్లోకి వెళితే... ఇబ్రహీంపట్నం సమీపంలోని గుంటుపల్లి వద్ద మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం వేగంగా వెళుతుండగా అదుపుతప్పింది. దీంతో ముందువెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కూడా అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో పోలీసులకు గానీ, లారీ డ్రైవర్ కు గానీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. 

అయితే పోలీస్ వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవడంతో రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చులు భరించాలని పోలీసులు లారీ డ్రైవర్ ను బెదిరించారట. దీంతో భయపడిపోయిన లారీ డ్రైవర్ ఓనర్ కు సమాచారం అందించాడు. దీంతో అతడు కూడా ఘటనాస్థలికి చేరుకుని పోలీసులతో మాట్లాడినా డబ్బులు ఇవ్వాల్సిందేనని  తేల్చిచెప్పారట. ఇదే సమయంలో అటువైపు వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమకు పోలీసుల తీరుగురించి చెప్పారు లారీ డ్రైవర్, ఓనర్. దీంతో వెంటనే ఉమ లారీ డ్రైవర్ కు మద్దతుగా నిలిచి డబ్బులు ఎందుకివ్వాలని పోలీసులను నిలదీసారు.    

వీడియో

లారీ డ్రైవర్ ను బెదిరించిన ఆరుగురు పోలీసులు అక్కడినుండి జారుకోవడంతో అక్కడేవున్న మరో పోలీస్ తో దేవినేని ఉమ ప్రశ్నించారు. తప్పుచేసి లారీ యాక్సిడెంట్ కు కారణమయ్యింది పోలీసులేనని ఉమ అన్నారు. అయినా పోలీస్ వాహనం రిపేర్ కు డబ్బులివ్వాలని డిమాండ్ చేయడం దారుణమన్నారు. అయినా పోలీస్ వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవడం ఏమిటని ఉమ ప్రశ్నించారు. 

Read More  ఏపీ నీడ్స్ కాదు పీపుల్ హేట్స్ జగన్..: దేవినేని ఉమ సెటైర్లు

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో డ్రైవర్లు కాస్త ఓనర్లయ్యారని దేవినేని ఉమ అన్నారు. కానీ ఇప్పుడు ఓనర్లు క్లీనర్లు అవుతున్నారన్నారు. తిరిగి టిడిపి అధికారంలోకి వస్తేనే డ్రైవర్ల సమస్యలు పరిష్కారం అవుతాయని దేవినేని ఉమ పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios