వైసీపీ అధినేత జగన్.. ఇన్ని రోజులు చేసింది పాదయాత్ర కాదని.. విహారయాత్ర అని ఏపీ మంత్రి జవహర్ అభిప్రాయపడ్డారు.  జగన్ చేపట్టిన విహారయాత్ర నిన్నటితో ముగిసిందని.. ఇప్పుడు పరిహారపు యాత్ర ప్రారంభించారని విమర్శించారు.

గురువారం మంత్రి జవహర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో మోదీ, కేసీఆర్‌ను ఒక్కరోజు కూడా జగన్‌ విమర్శించలేదన్నారు. పగలు పాదయాత్ర..రాత్రి మోదీతో జగన్‌ మంతనాలు చేశారని ఆరోపించారు. బీజేపీ తో జగన్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి పారిపోయారని మంత్రి జవహర్‌ ఎద్దేవా చేశారు.