ఖాళీగా ఉన్న నేతలే  జనసేనలో చేరుతున్నారని ఏపీ మంత్రి జవహర్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో.. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. రావెల పార్టీ మారడంపై మంత్రి జవహర్ స్పందించారు.

జనసేన పార్టీ కార్యాలయంలో గంగిరెద్దుల హడావుడి కనిపిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఖాళీగా ఉండి ఎక్కడా షెల్టర్ దొరకని నేతలే జనసేనలోకి వెళుతున్నారని ఎద్దేవా చేశారు.రావెల కిషోర్‌బాబు.. ప్రజారాజ్యం స్థాపించిన నాటి నుంచే చిరంజీవి కుటుంబం చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. రావెల మంత్రిగా ఉండి.. మాదిగల సంక్షేమానికి ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు.