జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌కు పర్మనెంట్ టీడీపీ అని.. మిగిలినవన్నీ స్టెప్నీ పార్టీలు అని విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌కు పర్మనెంట్ టీడీపీ అని.. మిగిలినవన్నీ స్టెప్నీ పార్టీలు అని విమర్శించారు. ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఎంతసేపు టీడీపీకి మేలు చేయాలనేదే పవన్ కల్యాణ్ ఆలోచన అని ఆరోపించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసమే మోదీని పవన్ కల్యాణ్ కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌లోకి టీడీపీని కలుపుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారని ఆరోపించారు. 

గత కొంతకాలంగా బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని.. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు ఓట్లు, సీట్లు లేవని విమర్శించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పారు. మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకుతారని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వైజాగ్‌లో అందుబాటులో ఉండాలని ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ ఫోన్‌ కాల్‌ అందుకున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం రానున్నట్టుగా తెలుస్తోంది. మోదీతో పవన్ సమావేశం ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే వీరిద్దరి భేటీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ రోజు ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో.. మోదీతో పవన్ భేటీ ఈ రోజు రాత్రి జరుగుతుందా..?, శనివారం ఉదయం జరుగుతుందా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.