Asianet News TeluguAsianet News Telugu

మూడు పెళ్లిళ్లు చేసుకోమన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు... ఇదేనా యువతకు చెప్పేది: గుడివాడ అమర్‌నాథ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ . అభిమానులను 3 పెళ్లిళ్లు చేసుకోమని పవన్ ప్రేరేపిస్తున్నారని.. జనసేన కార్యకర్తల దాడులను పవన్ సమర్ధిస్తారా అంటూ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
 

minister gudivada amarnath fires on janasena chief pawan kalyan
Author
First Published Oct 16, 2022, 2:37 PM IST

విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ పర్యటన పెట్టుకున్నారని అన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలే కదా అని గుడివాడ ప్రశ్నించారు. విశాఖపట్నం రావడానికి మూడు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నానని.. పవన్ అంటున్నారని, కానీ అప్పుడు జనవాణి కార్యక్రమమే మొదలుపెట్టలేదని మంత్రి అన్నారు. పవన్ కల్యాణ్ సూటిగా సమాధానం చెప్పాలని.. ఉత్తరాంధ్రపై ఆయన కక్ష కట్టారని గుడివాడ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ టెర్రరిస్ట్ అని ఆయన అభివర్ణించారు. 

ఆయనకు షూటింగ్‌లు చేసుకుంటే వచ్చే డబ్బు కంటే చంద్రబాబు ఇచ్చిన డబ్బే సేఫ్‌గా వస్తుందంటూ మంత్రి సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రొడక్షన్‌లో నాదెండ్ల డైరెక్షన్‌లో జనసేన నడుస్తోందని గుడివాడ ఆరోపించారు. అభిమానులను 3 పెళ్లిళ్లు చేసుకోమని పవన్ ప్రేరేపిస్తున్నారని.. జనసేన కార్యకర్తల దాడులను పవన్ సమర్ధిస్తారా అంటూ అమర్‌నాథ్ ప్రశ్నించారు. పవన్ తీరునే జనసేన కార్యకర్తలు అనుసరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడులను ప్రభుత్వం సహించదని.. ఆదివారం షూటింగ్‌లకు సెలవు కాబట్టే పవన్ విశాఖకు వచ్చారని గుడివాడ సెటైర్లు వేశారు. 

ALso Read:నేరస్తుడికి అధికారమిస్తే ఇలానే ఉంటుంది: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

చంద్రబాబు దాడిని ఖండించకుండా అరెస్ట్‌లను తప్పుబడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. యువకులకు పవన్ ఇచ్చే దిశానిర్దేశం ఇదేనా అని మంత్రి ప్రశ్నించారు. ఇంట్లో ఒక్కరినే సరిగా చూసుకోలేని పవన్ రాష్ట్రాన్ని ఎలా చూస్తాడని గుడివాడ ఎద్దేవా చేశారు. హిందూ సంప్రదాయం ఏంటీ..? పవన్ కామెంట్లేంటీ అని మంత్రి ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలను పదే పదే చూపిస్తే ప్రజలకు అతని నైజం తెలుస్తుందని.. జనసేన అసలు రాజకీయ పార్టీయేనా అంటూ గుడివాడ నిలదీశారు. జనసేన పార్టీకి విలువలు ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు. విశాఖ రాజధాని అయితే పవన్‌కు ఇబ్బందేంటని గుడివాడ నిలదీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios