వన్ కళ్యాణ్ పై 25 ప్రశ్నల లేఖను సంధించిన మంత్రి గంటా

Minister Ganta Srinivasa Rao criticize Pawan Kalyan Comments on Govt
Highlights

ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి గంటా శ్రీనివాస్ స్పందిచారు. ఆయనకు 25 ప్రశ్నలను సంధిస్తూ ఓ లేఖ రాశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడటం లేదని, రైల్వే జోన్ గురించి ఎందుకు నిలదీయడం లేదంటూ పవన్ పై గంటా ప్రశ్నల  వర్షం కురిపించారు.

అదనపు విద్యుత్ ఉత్పత్తి, డిజిటలైజేషన్ విషయంలో ఎపి కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు పొందిందని గుర్తుచేసిన గంటా ఈ విషయాన్ని పవన్ గుర్తించాలన్నారు.ఇలా అభివృద్ది పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి విమర్శించడం తగదని పవన్ కు సూచించారు. పవన్ కళ్లుండి కూడా చూడలేని కబోదిలాగ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై, సీఎంపై అన్నీ అవాస్తవపూరిత, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఆయన మాట్లాడేది    బిజెపి స్క్రిప్టా లేక జగన్ మోహన్ రెడ్డి ఆలోచనో తనకు అర్థంకావడం లేదన్నారు. లేక వీరందరూ కలిసి కూడబలుక్కుని పవన్ చేత ఇలా మాట్లాడిస్తున్నారా అని అనమానం కలుగుతోందని గంటా అన్నారు.

అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని అంటూనే కేంద్ర ప్రభుత్వానికి పవన్ , జగన్ లు ఎందుకు వంతపాడుతున్నారని గంటా నిలదీశారు. మోదీ అనే రెండక్షరాలను ఉచ్చరించడానికి కూడా వారు భయపడుతున్నారని విమర్శించారు. కానీ పోరాటం చేస్తున్న తెలుగు దేశం పార్టీని మాత్రం నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారని,  దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని గంటా వారిని సూచించారు.

loader