వైసీపీ నేతలపై మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. వైసీపీ నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో మహిళలకు పసుపు-కుంకుమ పథకం డబ్బులు అందకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి వృద్ధులకు కూడా పెన్షన్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. బెయిల్ పై బయటకు వచ్చి.. ఆర్థిక ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా... దేవాలయాల గురించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు చెబుతున్నవారిపై దాడులు చేస్తున్నారని దేవినేని ఉమ వాపోయారు.