దేవినేని కారుకు ప్రమాదం

First Published 27, Dec 2017, 8:33 AM IST
Minister devineni car met with an accident
Highlights
  • ఏపి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

ఏపి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బెంగుళూరు నుండి అనంతపురంకు కారులో వెళుతున్నపుడు ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. డ్రైవర్ సడెన్ బ్రేకు వేయటంతో వెనుక నుండి వస్తున్న కారు మంత్రి కారును ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఉదయం మంత్రి కారు బెంగుళూరు నుండి అనంతపురంకు బాగా వేగంగా వెళుతున్నది. అయితే, హంద్రీ-నీవా కాలువ పనులను చూసే ఉద్దేశ్యంతో కారును ఆపాలంటూ మంత్రి ఆదేశించారు. వెంటనే డ్రైవర్ కారుకు హటాత్తుగా బ్రేకులు వేసారట. దాంతో వెనకే వస్తున్న మరో కారు నేరుగా వచ్చి మంత్రి కారును ఢీకొన్నది. ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనకవైపు బాగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో మంత్రి దేవినేని పరిస్ధితేంటి ? మంత్రితో పాటు ప్రయాణిస్తున్న మిగిలిన వాళ్ళ పరిస్ధితేంటి అన్న విషయాలపై ఎవరూ  స్పష్టమైన సమాచారం ఇవ్వటం లేదు.

loader