టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలుకు హైకోర్టు ఎందుకు వద్దంటున్నారని మంత్రి ప్రశ్నించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే.. కర్నూలుకు హైకోర్టు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. 

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారని అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇందులో తప్పేమి లేదని మంత్రి పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే.. కర్నూలుకు హైకోర్టు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. కర్నూలుకు హైకోర్టు వద్దని చంద్రబాబు నాయుడు అనడం ఆశ్చర్యంగా వుందని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 

అంతకుముందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసిన హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానిని అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు..ఇక్కడ అడుగుపెట్టిన అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. 

ALso REad:కర్నూలులో బాబుకు చేదు అనుభవం.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు...

ఇదిలా ఉండగా, నవంబర్ 3న ఏపీ హైకోర్టు మూడు రాజధానుల మీద సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తాము స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి చర్యలు అభినందించదగినవి కావు అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదు అంది. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుందని ప్రశ్నించింది.